34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ జీవోలు కొట్టివేత అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించినట్లు సమాచారం. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటే అవకాశం ఉందన్న అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై సెప్టెంబర్లో వాదనలు పూర్తయిన అనంతరం ధర్మాసనం...