గూడూరులో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

సత్య వెలుగు న్యూస్ , గూడూరు:గూడూరు పట్టణంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గానికి చెందిన పలువురు దళిత నాయకులు, సామాజికవేత్తలు, రజక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పాల్గొని పార్టీ కార్యాలయ ఏర్పాటు పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై చర్చించేందుకు ఈ కార్యాలయం వేదికగా నిలవనుందని నిర్వాహకులు...