బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు
-బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ చౌడేపల్లి, అక్టోబర్ 12, సత్య వెలుగు న్యూస్:ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మధుసూదన్ నాయుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలు, పండ్లతో ఆలయానికి ప్రత్యేక అలంకరణ దసరా మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి...