కరువు మండలాలుగా ప్రకటించాలని రైతుల మహాధర్నా

- ఎమ్మిగనూరులో రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్న రాజీవ్ రెడ్డి - పంట బీమా, నష్టపరిహారం అందించాలని డిమాండ్ - ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక ఎమ్మిగనూరు, అక్టోబర్ 8, సత్య వెలుగు న్యూస్: కరువు పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాలను వెంటనే తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో భారీ మహాధర్నా నిర్వహించారు. పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి నాయకత్వంలో...