చీకట్లో మగ్గుతున్న మెట్టు గ్రామం , కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా వీధి దీపాలు బిగించని అధికారులు
చిట్టమూరు మండలం, అక్టోబర్ 4: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామం రాత్రి వేళల్లో గాఢాంధకారంలో మునిగిపోతోంది. గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల క్రితం గ్రామంలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అయితే స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి వీధి దీపాలు బిగించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు పాత వీధి దీపాలు కూడా మరమ్మతులకు నోచుకోకపోవడంతో గ్రామంలోని పలు ప్రాంతాలు పూర్తిగా చీకటిమయంగా మారాయి. రాత్రి 7 గంటలు...