ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. పటిష్ట పోలీస్ భద్రత!
-13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు.. -భద్రత కోసం 36,351 మంది పోలీసుల మోహరింపు అమరావతి – సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈరోజు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీ చేపట్టనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా...