రోజాపై తీవ్ర విమర్శలు చేసిన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్

నగరి, అక్టోబర్ 7 (సత్య వెలుగు న్యూస్): మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తీవ్రస్థాయిలో స్పందించారు. రోజా వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నాయని ఆయన విమర్శించారు. రోజా మాట్లాడుతున్న తీరు, భాషపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణలకు దారితీయకూడదని, ప్రజా జీవితంలో ఉన్న నాయకులు సంయమనం పాటించాలని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ గత పాలనపై కూడా ఎమ్మెల్యే విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు....