క్రికెట్‌లో కొత్త ఫార్మాట్‌.. అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి ఆడేలా!

ముంబై, అక్టోబరు 16 ,సత్య వెలుగు న్యూస్: క్రికెట్‌లో మరో వినూత్న ఫార్మాట్‌ అందుబాటులోకి రానుంది. మహిళలు, పురుషులు వేర్వేరుగా మ్యాచ్‌లు ఆడినా.. రెండు జట్ల స్కోర్లను కలిపి విజేతను నిర్ణయించేలా ‘టెస్ట్‌ ట్వంటీ’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. క్రికెట్‌లో నాలుగో ఫార్మాట్‌గా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ టోర్నీ తొలి సంచిక నవంబరు 14 నుంచి 29 వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుంది. సింహాలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ మైదానం ఈ పోటీలకు వేదిక కానుంది. ఒక్కో జట్టులో 40 మంది ఆటగాళ్లు...