సూళ్లూరుపేటలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మోడీ విమలకుమారి నామినేషన్
-మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల బరిలోకి! సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోడీ విమలకుమారి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆమె ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఆ పార్టీ తరఫున మోడీ విమలకుమారి నామినేషన్ దాఖలు చేయడంతో సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది....