నామినేషన్ల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులతో అధికారుల సమావేశం
పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బుధవారం పెళ్లకూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు సమావేశమయ్యారు. మండల ప్రత్యేక అధికారి డాక్టర్ పి. ధనుంజయులు, సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై ఆదిలక్ష్మి, తహసీల్దార్ సీహెచ్ హరికృష్ణ, ఎంపీడీవో వేణయ్య ఈ సమావేశంలో పాల్గొని నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై నాయకులకు వివరించారు....