నాయుడుపేట ఎంపీపీ రేసులో పరసా రాజా.. గోటిప్రోలు ఎంపీటీసీ పేరు తెరపైకి!

-మండల పరిషత్ అధ్యక్ష పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.. -అవకాశం దక్కుతుందా అనే అంశంపై ఉత్కంఠ... నాయుడుపేట: నాయుడుపేట మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పదవికి సంబంధించి రాజకీయ వర్గాల్లో చర్చ ఆసక్తికరంగా మారుతోంది. గోటిప్రోలు ఎంపీటీసీ పరసా రాజా పేరు ఎంపీపీ రేసులో వినిపిస్తుండటంతో మండల రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఆయనకు అవకాశం దక్కుతుందా? పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల్లో...