దొరవారిసత్రం రాజకీయాల్లో పార్టీ మార్పుల కలకలం!
-టీడీపీలో చేరిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి గాయత్రిరెడ్డి సత్య వెలుగు న్యూస్ | నాయుడుపేట | అక్టోబర్ 29:దొరవారిసత్రం మండల రాజకీయాల్లో పార్టీ మార్పులు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కామిరెడ్డి గాయత్రిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. వైసీపీ బీఫామ్‌తో నామినేషన్ సమర్పించి, ఫ్యాన్ గుర్తు కేటాయించిన అనంతరం ఆమె టీడీపీలో చేరినట్లు సమాచారం. టీడీపీ కండువా కప్పుకున్న గాయత్రిరెడ్డి సూళ్లూరుపేటలోని టీడీపీ నాయకుడు కొండేపాటి...