విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం ఎంతో ముఖ్యం: విద్యావేత్తలు
చౌడేపల్లి, అక్టోబర్ 30 – సత్య వెలుగు న్యూస్:విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా వ్యక్తిత్వ వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు ప్రముఖ విద్యావేత్తలు పిలుపునిచ్చారు. స్థానిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా గణితశాస్త్ర అధ్యాపకులు మునిరాజా మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరమని అన్నారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటూ సృజనాత్మక శక్తిని పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. భౌతికశాస్త్ర అధ్యాపకులు...