గాంధీజీకి పోలీసుల ఘన నివాళి తిరుపతిలో ఘనంగా జయంతి వేడుకలు – జిల్లా ఎస్పీ పుష్పాంజలి
తిరుపతి, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలను ఎస్పీ స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి, సేవాభావం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి...