సర్పంచ్ రేసులో పుట్టా భానుప్రకాష్ పేరు జోరు!
-చెన్నప్ప నాయుడుపేటలో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగాలని గ్రామస్తుల ఆకాంక్ష పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలం చెన్నప్ప నాయుడుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పుట్టా భానుప్రకాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని గ్రామస్తులు, అభిమానులు కోరుకుంటున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. ప్రజలతో మమేకమై.. సేవే లక్ష్యంగా! గ్రామ ప్రజలతో కలివిడిగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే పుట్టా భానుప్రకాష్‌కు స్థానికంగా మంచి గుర్తింపు ఉందని ఆయన...