sathyavelugu.com
Date of Publish : 02 October 2026, 10:49 pm Posted by : Dr.K.Suresh Editor

కలవకూరు పంచాయతీలో రిఫార్మ్ ఉత్సవ్ ప్రత్యేక గ్రామ సభ

పెళ్లకూరు, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్:
పెళ్లకూరు మండలం కలవకూరు పంచాయతీలో రిఫార్మ్ ఉత్సవ్‌లో భాగంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి పి.యం. అన్నపూర్ణ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పంచాయతీ కార్యదర్శి సాయి, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజల సమస్యలు, సూచనలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు.

ఈ ప్రత్యేక గ్రామ సభలో సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు