ఉప్పలమర్తి పంచాయతీలో రిఫార్మ్ ఉత్సవ్ ప్రత్యేక గ్రామ సభ
చిట్టమూరు, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్: రిఫార్మ్ ఉత్సవ్‌లో భాగంగా చిట్టమూరు మండలం ఉప్పలమర్తి పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూ జేఈ శ్రీ మహేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీ ఎల్లయ్య, టీడీపీ నాయకులు శ్రీ చిగురువాడ మురళీధర్, ఎనర్జెసీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని...