చౌడేపల్లి బస్టాండ్ వద్ద ఆక్రమణలు తొలగించండి మహాప్రభూ!
-సర్వేలకే పరిమితమైన రోడ్డు విస్తరణ.. -ట్రాఫిక్ కష్టాలతో వాహనదారుల అవస్థలు చౌడేపల్లి, అక్టోబర్ 15 ,సత్య వెలుగు న్యూస్:చౌడేపల్లి బస్టాండ్ పరిసరాల్లో రోడ్డు ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు. నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ రోడ్డు విస్తరణ పనులు సర్వేలు, మార్కింగ్‌లకే పరిమితమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చౌడేపల్లి–తిరుపతి ప్రధాన రహదారిలో బస్టాండ్‌కు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద...