ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్‌.. కొత్త తేదీలు ఇవే!

అమరావతి, సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్‌ 1వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడైంది. అక్టోబర్‌ 25న మధ్యాహ్నం 3 గంటలతో అభ్యర్థుల ప్రచార గడువు ముగియనుండగా, నవంబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అవసరమైతే నవంబర్‌ 2న రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం...