sathyavelugu.com
Date of Publish : 10 October 2026, 8:57 pm Posted by : Dr.K.Suresh Editor

వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు రామ్మూర్తికి ఆర్కే రోజా నివాళి

నగరి,అక్టోబర్ 10 ,సత్య వెలుగు న్యూస్: నగరి రూరల్ మండలం గుండ్రాజుకుప్పం హరిజనవాడకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు రామ్మూర్తి (అమితాబచ్చన్) ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా ఆయన నివాసానికి వెళ్లి రామ్మూర్తి చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పార్టీకి, ప్రజలకు రామ్మూర్తి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.