వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు రామ్మూర్తికి ఆర్కే రోజా నివాళి
నగరి,అక్టోబర్ 10 ,సత్య వెలుగు న్యూస్: నగరి రూరల్ మండలం గుండ్రాజుకుప్పం హరిజనవాడకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు రామ్మూర్తి (అమితాబచ్చన్) ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజా ఆయన నివాసానికి వెళ్లి రామ్మూర్తి చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీకి, ప్రజలకు రామ్మూర్తి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కష్ట సమయంలో...