రాయలసీమకు రూ.లక్ష కోట్ల ఉద్యాన ప్రణాళిక మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

మదనపల్లె, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రూ.లక్ష కోట్ల అంచనా పెట్టుబడితో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు మదనపల్లెలో శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు దశల్లో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ వర్గాల ప్రకారం సుమారు రూ.40,352 కోట్ల ప్రభుత్వ నిధులు, మరో రూ.60 వేల కోట్ల...