శ్రీకాళహస్తి, సత్య వెలుగు న్యూస్ : శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు సర్వీస్ రోడ్ల మీదుగా నడపాలని సిరసనంబేడు, చవలి తదితర గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మార్గంలో వెళ్లే కొన్ని పల్లెవెలుగు బస్సులు సర్వీస్ రోడ్లలోకి రాకుండా నేరుగా హైవేపై ప్రయాణిస్తుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వీస్ రోడ్లపై ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్నప్పటికీ, బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయని వాపోతున్నారు. దీంతో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు, రోజువారీ పనుల నిమిత్తం ప్రయాణించే గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
ఆర్టీసీ అధికారులు స్పందించాలి
గ్రామీణ ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ (డీఎం) వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత మార్గంలో కేటాయించిన ఆర్డినరీ పల్లెవెలుగు బస్సులను సర్వీస్ రోడ్ల మీదుగా నడిపించి, ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని సిరసనంబేడు, చవలి గ్రామాల ప్రజలు కోరుతున్నారు.