సర్వీస్ రోడ్డులో పల్లెవెలుగు బస్సులు నడపాలి , హైవేపై వెళ్లడంతో గ్రామీణ ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
శ్రీకాళహస్తి, సత్య వెలుగు న్యూస్ : శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు సర్వీస్ రోడ్ల మీదుగా నడపాలని సిరసనంబేడు, చవలి తదితర గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మార్గంలో వెళ్లే కొన్ని పల్లెవెలుగు బస్సులు సర్వీస్ రోడ్లలోకి రాకుండా నేరుగా హైవేపై ప్రయాణిస్తుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ రోడ్లపై ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్నప్పటికీ, బస్సులు ఆగకుండా వెళ్లిపోతున్నాయని వాపోతున్నారు. దీంతో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు, రోజువారీ...