–భారీ వాహనాల రాకపోకలతో వైర్లు తెగిపడి.. ట్రాఫిక్‌కు అంతరాయం
నాయుడుపేట, అక్టోబర్ 6, సత్య వెలుగు న్యూస్: పట్టణంలోని బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో సెంటర్ లైట్ల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ప్రమాదకరంగా మారాయి. రహదారిపై ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు భారీ వాహనాలు యూటర్న్ చేసే సమయంలో వాటికి తగిలి తెగిపడుతున్నాయి.
విద్యుత్ సరఫరా ఉన్న వైర్లు రోడ్డుపై వేలాడటం, తెగిపడటంతో షార్ట్‌సర్క్యూట్‌తో పాటు విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైర్లు వాహనాలకు అడ్డుగా మారడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.
సెంటర్ లైట్లు పనిచేయకపోవడంపై సత్య వెలుగు కథనం ప్రచురించడంతో మున్సిపల్ సిబ్బంది స్పందించి తాత్కాలిక కనెక్షన్లు ఏర్పాటు చేసి లైట్లను పునరుద్ధరించారు. అయితే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైర్లు భారీ వాహనాల రాకపోకలకు అనుగుణంగా లేకపోవడంతో సమస్య మళ్లీ తలెత్తుతోంది.
ప్రజలు, వాహనదారుల భద్రత దృష్ట్యా తెగిపోయిన వైర్లను వెంటనే తొలగించి, సెంటర్ లైట్లకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి, వైర్లను సురక్షితంగా అమర్చాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం చోటుచేసుకునేలోపే అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.