sathyavelugu.com
Date of Publish : 31 October 2026, 9:16 am Posted by : Dr.K.Suresh Editor

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు చారాల ఉన్నత పాఠశాల విద్యార్థుల ఎంపిక!

చౌడేపల్లి, అక్టోబర్ 30 – సత్య వెలుగు న్యూస్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు చారాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్-14 బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు చారాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వహించగా, పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కె. అనిల్ కుమార్ బాలుర విభాగంలో, జ్ఞాన ప్రసూన బాలికల విభాగంలో తమ ప్రతిభను చాటుకుని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఎంపికైన విద్యార్థులు నవంబర్ చివరి వారంలో కృష్ణా జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్. రాజేంద్రబాబు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. రేణుకతో పాటు ఉపాధ్యాయులు ఎంపికైన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్. రాజేంద్రబాబును అభినందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజా, రమణబాబు, సహదేవయ్య, నారాయణ, సుబ్రహ్మణ్యం, మార్ కొండయ్య, రూబీ రాణి, శ్రీదేవి, ప్రతిమ, వెంకటరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.