ప్యాకెట్ పాలు.. కాచి వాడాలా? నేరుగా వాడాలా?
- పాల వినియోగంపై సందేహాలు - ప్రాసెసింగ్ విధానాన్ని తెలుసుకోవడం ముఖ్యం అక్టోబర్ 4 , సత్య వెలుగు న్యూస్: ప్యాకెట్ పాలను కాచి వాడాలా లేదా నేరుగా వాడాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా ప్యాకెట్ పాలు ప్రత్యేక ఉష్ణ ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. అయినప్పటికీ వినియోగదారులు ప్యాకెట్‌పై ఉన్న సూచనలను పరిశీలించడం అవసరమని ఆహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల పాలను ప్రత్యేక ఉష్ణోగ్రతల వద్ద శుద్ధి చేసిన తర్వాత నేరుగా తాగేందుకు...