నెల్లబల్లిలో ‘స్మార్ట్ శ్రామిక మిషన్’ గ్రామసభ విజయవంతం
పెళ్లకూరు,సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం నెల్లబల్లి గ్రామంలో ‘స్మార్ట్ శ్రామిక మిషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ ఘనంగా జరిగింది. “మన గ్రామం – మన బాధ్యత – మన అభివృద్ధి” నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల అనుసంధానం, బ్యాంకింగ్ సేవలు అందించడమే మిషన్ లక్ష్యమని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మిషన్ డైరెక్టర్...