చిల్లకూరులో స్మార్ట్ శ్రామిక్ మిషన్ అవగాహన కార్యక్రమం
పెళ్లకూరు, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులు, వివిధ వృత్తిదారులు, యువతకు ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య, సామాజిక భద్రతా సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్మార్ట్ శ్రామిక్ మిషన్ (SSM) ఆధ్వర్యంలో పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మిషన్ కోఆర్డినేటర్ పి. విజయలక్ష్మి ఆదేశాల మేరకు, SSM మేనేజింగ్ డైరెక్టర్ డా. సూర్య నాగేంద్ర, మిషన్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...