ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా.. ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి

నాయుడుపేట, అక్టోబర్ 28 ,సత్య వెలుగు న్యూస్:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి రూపాయికీ లెక్క ఉండేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు కె. మహబూబ్ బాషా (ఐఎఫ్ఎస్) అధికారులకు సూచించారు. ఎన్నికల వ్యయ నిర్వహణలో పారదర్శకత పాటించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నాయుడుపేట పట్టణంలోని కేకే కల్యాణ మండపంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలో...