ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

2,500 మంది పోలీసులతో భద్రతా చర్యలు – జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట, అక్టోబర్ 31:తిరుపతి నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. శనివారం నాయుడుపేటలోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాలను...