ఆదరించి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం!
-నాయుడుపేటలో వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ప్రచారం నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 4వ, 5వ వార్డుల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు. తనను ఇంటి ఆడపడుచుగా భావించి ఆశీర్వదించి గెలిపించాలని, నాయుడుపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, మాజీ చైర్పర్సన్ కటకం దీపిక...