ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు నోటీసులు!
-రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు.. తుది తీర్పునకు లోబడి విలీన ప్రక్రియ ఢిల్లీ, సత్య వెలుగు న్యూస్:ఆంధ్రప్రదేశ్లో గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. గ్రామాల విలీనంపై అభ్యంతరాలు గ్రామ పంచాయతీల తీర్మానాలు, స్థానిక సంస్థల ఆమోదం లేకుండానే గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారని పిటిషనర్లు వాదించినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలు పాటించలేదని...