నూతన ఎస్సైని సన్మానించిన టీడీపీ నాయకులు
ఓజిలి ఎస్సై ఎం. శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన యద్దల ధనుంజయ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి ఓజిలి, సత్య వెలుగు న్యూస్:ఓజిలి పోలీస్ స్టేషన్లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీనివాసరావును సోమవారం ఓజిలి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యద్దల ధనుంజయ రెడ్డి, యువ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై ఎం. శ్రీనివాసరావుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, బాధితులకు న్యాయం జరిగేలా సేవలందించాలని వారు కోరారు....