నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ అరాచకాలు, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

నాయుడుపేట, అక్టోబర్ 25,సత్య వెలుగు న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం సరికాదని ఆయన విమర్శించారు. ఆదివారం నాయుడుపేటలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు స్వాగతం...