sathyavelugu.com
Date of Publish : 25 October 2026, 9:54 pm Posted by : Dr.K.Suresh Editor

27, 29, 30, 31వ వార్డుల్లో తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విస్తృత ప్రచారం

-ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య..

-ప్రజల నుంచి విశేష స్పందన!

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 27, 29, 30, 31వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రజలను కలిశారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమానికి, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు. నాయుడుపేట మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి కాలువలు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ప్రతి గడపను పలకరిస్తూ, ప్రజలతో ఆప్యాయంగా మమేకమయ్యారు. ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలోకి వచ్చామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్ తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.