sathyavelugu.com
Date of Publish : 23 October 2026, 8:53 pm Posted by : Dr.K.Suresh Editor

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. అభివృద్ధికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న తంబిరెడ్డి రాజేశ్వరమ్మ!

-నాయుడుపేటలో 6వ, 2వ వార్డుల్లో పర్యటన..

-రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఆరా

నాయుడుపేట,సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 6వ వార్డులోని మాలాయకాట ప్రాంతంతో పాటు 2వ వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్న రాజేశ్వరమ్మ, వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తనకు అవకాశం కల్పించి ఆశీర్వదిస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తానని భరోసా ఇచ్చారు.

ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి అంశాలపై హామీలు ఇస్తూ సాగిన రాజేశ్వరమ్మ పర్యటన స్థానికంగా చర్చనీయాంశమైంది.