ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. అభివృద్ధికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న తంబిరెడ్డి రాజేశ్వరమ్మ!
-నాయుడుపేటలో 6వ, 2వ వార్డుల్లో పర్యటన.. -రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఆరా నాయుడుపేట,సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 6వ వార్డులోని మాలాయకాట ప్రాంతంతో పాటు 2వ వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్న రాజేశ్వరమ్మ,...