నాయుడుపేటలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ప్రచారం ముమ్మరం

నాయుడుపేట,సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రజలను కలుస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్‌రెడ్డి సతీమణి రాజేశ్వరమ్మ అభ్యర్థిత్వం నాయుడుపేట రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారుడు, టీఎంఆర్ గ్రూప్స్ అధినేత తంబిరెడ్డి మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ ప్రచారం...