అపాచీ ఫుట్‌వేర్ కంపెనీలో కార్మికుడి మృతి!
-12 గంటల పని ఒత్తిడే కార్మికుల ప్రాణాలు తీస్తోందా? — కార్మిక సంఘాల ఆగ్రహం -మాంబట్టు సెజ్‌లో ఘటన.. అపాచీ కంపెనీలో వరుస మరణాలపై ఆందోళన తడ, తిరుపతి జిల్లా: తిరుపతి జిల్లా తడ మండలంలోని మాంబట్టు సెజ్‌లో ఉన్న అపాచీ ఫుట్‌వేర్ కంపెనీలో గురువారం విధుల్లో ఉన్న ఓ కార్మికుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. గత కొన్ని నెలలుగా కంపెనీలో పలువురు కార్మికులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం...