స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వార్డుల పునర్విభజన వివాదానికి తెర
అమరావతి, అక్టోబర్ 2 (సత్య వెలుగు న్యూస్): ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో కీలక అడ్డంకి తొలగినట్లు తెలుస్తోంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. వార్డులు, డివిజన్ల పునర్విభజన విషయంలో పరిపాలనా ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేయడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైనట్లు అధికారులు భావిస్తున్నారు. 3,206 నుంచి 3,942కు పెరిగిన వార్డులు, డివిజన్లు పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని వివిధ...