మదనపల్లె సభకు చౌడేపల్లి నుంచి తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు, యువ నాయకుడు ప్రదీప్ రాజు ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

చౌడేపల్లి, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమానికి చౌడేపల్లి మండలం నుంచి టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. యువ నాయకుడు ప్రదీప్ రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు సభకు బయలుదేరారు. మదనపల్లెలో రూ.1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ...