నందిమంగళం గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ప్రమాదకరంగా మారిన రోడ్డు

-బ్రిడ్జి దెబ్బతిన్నా పట్టించుకోని హైవే అధికారులు.. ప్రమాదాలు జరగకముందే -మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్ సత్య వెలుగు న్యూస్ , నందిమంగళం :నందిమంగళం గ్రామ ప్రవేశ ద్వారం వద్ద రహదారి ప్రమాదకరంగా మారింది. గ్రామంలోకి ప్రవేశించే మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో పాటు, అక్కడ మట్టి కుప్పలు వేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు సరైన దారి లేకపోవడంతో పాదచారులు కాలుజారి పడే ప్రమాదం నెలకొంది. ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనచోదకులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న బ్రిడ్జితో ప్రమాద భయం గ్రామ...