చట్టాలు ఎన్నో.. న్యాయం అందరికీ అందుతోందా?

అక్టోబర్ 14, సత్య వెలుగు :న్యాయం అనేది ప్రజాస్వామ్యానికి పునాది. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం, అన్యాయానికి గురైన వారికి అండగా నిలవడం, తప్పు చేసినవారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడటం న్యాయవ్యవస్థ ప్రధాన లక్ష్యాలు. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు రాజ్యాంగం ఎన్నో హామీలను కల్పించింది. మహిళలు, పిల్లలు, కార్మికులు, రైతులు, వృద్ధులు, బలహీన వర్గాల రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ సమాజంలో అన్యాయాలు, మోసాలు, వివక్ష, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలు ఉన్నంత మాత్రాన...