sathyavelugu.com
Date of Publish : 11 October 2026, 8:47 pm Posted by : Dr.K.Suresh Editor

నాయుడుపేట అర్బన్ సీఐగా తురక వెంకటరమణ బాధ్యతల స్వీకరణ,-గబ్బర్ సింగ్‌గా పేరొందిన వెంకటరమణకు పోలీస్ సిబ్బంది స్వాగతం

సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట:నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా తురక వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ ఆదివారం రాత్రి 7.45 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయులు ఆదేశాల మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా నూతన సీఐ వెంకటరమణను అర్బన్ ఎస్సై ఎం. శివశంకరరావు శాలువాతో సత్కరించి, పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం

ఈ సందర్భంగా సీఐ వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేస్తూ, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.