నాయుడుపేట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట భద్రత , ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ వెంకటరమణ

నాయుడుపేట, తిరుపతి జిల్లా:తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు ఎన్నికల సంఘం నియమావళిని తప్పనిసరిగా పాటించాలని నాయుడుపేట సీఐ వెంకటరమణ సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, హింసాత్మక ఘటనలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం...