దొరవారిసత్రంలో ట్రాన్స్‌ఫార్మర్లే టార్గెట్‌.. వరుస చోరీలతో రైతుల ఆందోళన!

-విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటల సాగుకు ఆటంకం.. -రాత్రి గస్తీ పెంచాలని రైతుల విజ్ఞప్తి దొరవారిసత్రం, అక్టోబర్ 25 ,సత్య వెలుగు న్యూస్:తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం వెదురుపట్టు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంటలకు సాగునీరు అందించేందుకు పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు వరుసగా చోరీలకు పాల్పడుతున్నట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి విలువైన సామగ్రి చోరీ వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్...