నాయుడుపేట పురపాలక సంఘంలో గాంధీజీకి ఘన నివాళులు
-గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ ఫజులుల్లా, మేనేజర్ ఉరుకుందమ్మ నాయుడుపేట, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా, మేనేజర్ ఉరుకుందమ్మ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను, ఆయన పాటించిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి...