తుఫాన్ హెచ్చరిక.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు!
-తుఫాన్ హెచ్చరిక.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు! -కోట తహసీల్దార్ కటారి జయజయరావు సూచన -గోవిందపల్లిపాలెం, శ్రీనివాససత్రం గ్రామాల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి సత్య వెలుగు న్యూస్, కోట: తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు సూచించారు. సోమవారం గోవిందపల్లిపాలెం, శ్రీనివాససత్రం గ్రామాలకు చెందిన మత్స్యకారులు, కాపులు ఈ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. తుఫాన్ కారణంగా సముద్రంలో...