ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వాసుదేవ నాయుడిని అఖండ మెజార్టీతో గెలిపించండి!
-శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పిలుపు సత్య వెలుగు న్యూస్ | శ్రీకాళహస్తి:ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాసుదేవ నాయుడిని అఖండ మెజార్టీతో గెలిపించాలని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకులకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే వాసుదేవ నాయుడికి ఓటర్లు తమ విలువైన...